![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -345 లో.. కృష్ణ, మురారి ఇద్దరు కమీషనర్ గారిని కలుస్తారు. జరిగిందంతా చెప్పి అసలు నేరస్తులెవరో కనుక్కోవాలని కమీషనర్ కీ మురారి చెప్పి డ్యూటీలో జాయిన్ అవుతానని చెప్తాడు. ఇన్ని రోజులు కన్పించకుండా వెళ్లి రూపం మారి రావడం ఇదంతా కాంప్లికేటెడ్ గా ఉంది. పై అధికారులతో మాట్లాడాలని కమీషనర్ చెప్తాడు.
ఆ తర్వాత కమీషనర్ కి భవాని చెప్పిన కండిషన్ గురించి చెప్తాడు. ఎలాగైనా ఈ శుక్రవారం లోపు నేరస్తులను పట్టుకోవాలని కృష్ణ చెప్తుంది. సరే కొన్ని రైట్స్ మురారికి ఇస్తున్నాను. అలాగే ఈ విషయంలో ఏం హెల్ప్ కావాలన్న చేస్తానని కమీషనర్ చెప్తాడు. మరొకవైపు భవాని దగ్గరికి ముకుంద వస్తుంది. ఒకవేళ మురారి ఈ విషయం ఛేదిస్తే నా పరిస్థితి ఏంటని ముకుంద అనగానే.. నువ్వు నెగెటివ్ గా అలోచించకని భవాని చెప్తుంది. మరొకవైపు ముకుందకి ఎదరుగా మధు వచ్చి.. టెన్షన్ పడుతున్నావా అని అడుగుతాడు. లేదని ముకుంద అనగానే.. టెన్షన్ పడాలి మురారికి గతం గుర్తుకు వచ్చింది. నీకు మురారికి పెళ్లి జరగదని మధు అంటాడు. మరొకవైపు నిజం తెలుసుకుంటామని వెళ్లి ఇంకా రాలేదని భవాని అనుకుంటుండగా.. అప్పుడే కృష్ణ , మురారి ఇద్దరు వస్తారు. జైలుకి , హాస్పిటల్ కి వెళ్ళాం నేరస్తుడు ఎవరో తెలిసిందని మురారి అనగానే ముకుంద టెన్షన్ పడుతుంది. ఎవరో శేఖర్ అంట పరిమళ మేడమ్ చెప్పిందని మురారి అంటాడు. ముకుంద టెన్షన్ పడడం కృష్ణ చూస్తుంటుంది. ముకుంద ఎందుకు టెన్షన్ పడుతుంది తన హస్తం ఏమైనా ఉందా అని కృష్ణ అనుకుంటుంది. అ తర్వాత శేఖర్ అనే వ్యక్తి కూడా అ ప్రభాకర్ మనిషే అయి ఉండొచ్చు కదా అని భవాని అంటుంది
మరొకవైపు కృష్ణ దగ్గరికి రేవతి వస్తుంది. అ తర్వాత మురారి కూడా వస్తాడు. శ్రీనివాస్ బాబాయ్ మంచివాడు. కూతురు గురించి కాకుండా న్యాయంగా ఆలోచించి నాకు సపోర్ట్ చేస్తున్నాడని కృష్ణ అంటుంది. మరొకవైపు దేవ్ బెయిల్ మీద బయటకు వచ్చి శ్రీనివాస్ దగ్గరికి వస్తాడు. మురారికి శ్రీనివాస్ ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాలని అనుకుంటాడు. అప్పుడే దేవ్ తన మనుషులని పిలిచి శ్రీనివాస్ ని తీసుకొని వెళ్ళమని చెప్పి ఫోన్ పడేస్తాడు. మరొకవైపు కృష్ణ దగ్గరికి మురారి వచ్చి బట్టలు సర్దుకో ఇంటికి వెళదామని అనగానే కృష్ణ శకుంతల ఆశ్చర్యపోతారు. తరువాయి భాగంలో కృష్ణ, మురారిల దగ్గరికి దేవ్ ని తీసుకుని ముకుంద వస్తుంది. అతడిని వారికి పరిచయం చేస్తుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |